Share News

ఇంటి పన్నులు సక్రమంగా వసూలు చేయాలి : డీపీవో

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:10 PM

ఇంటి పన్నులు సక్రమంగా వసూలు చేయాలని డీపీవో వెంకటేశ్వర్లు అన్నారు

ఇంటి పన్నులు సక్రమంగా వసూలు చేయాలి : డీపీవో
మండల కార్యాలయంలో ఎంపీడీవో, కార్యదర్శులతో మాట్లాడుతున్న డీపీవో

గండీడ్‌ , మార్చి 11: ఇంటి పన్నులు సక్రమంగా వసూలు చేయాలని డీపీవో వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయా గ్రామాల కార్యదర్శులతో మాట్లాడారు. ప్రతీ గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. మిషన్‌ భగీరథ నీరు అందని గ్రామాల వివరాలు తెలియజేయాలన్నారు. నీటి సమస్యలు ఉన్న చోట డీఈతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. ఎండాకాలం ఆయా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో దేవన్న, ఎంపీవో శంకర్‌ నాయక్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:10 PM