కోర్టు తీర్పు మేరకే మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు: సర్కారు
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:10 AM
సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పు మేరకే నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయాలని

సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పు మేరకే నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో3 వల్ల ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ శాతం తగ్గిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా జారీ చేసిన ఈ రిజాయిండర్‌లో.. హారిజాంటల్ రిజర్వేషన్ల వల్ల ఎటువంటి వ్యత్యాసం ఉండదని, మహిళలకు, పురుషులకు సమాన రిజర్వేషన్లు దక్కుతాయని ప్రభుత్వం వెల్లడించింది.