Share News

ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణకు గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:23 AM

ప్రముఖ ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణకు తెలుగు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది.

ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణకు గౌరవ డాక్టరేట్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణకు తెలుగు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. తెలుగు సాంప్రదాయ నృత్యాలైన పేరిణి, ఆంధ్రనాట్యాలకు విశేష సేవలందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళాకారులకు శిక్షణను అందించినందుకు గౌరవ డాక్టరేట్‌తో సన్మానం చేయనున్నట్లు తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెస్‌ తంగెడ కిషన్‌రావు, వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కోట్ల హనుమంతరావు తెలిపారు. 28న రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను కళాకృష్ణకు గవర్నర్‌ తమిళసై ప్రదానం చేస్తారని వివరించారు.

Updated Date - Feb 25 , 2024 | 10:33 AM