Share News

ఓటింగ్‌లో హిందువులు ఐక్యత చాటారు

ABN , Publish Date - May 15 , 2024 | 03:10 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో హిందువులు ఐక్యత చాటారని, హిందువులు ఏకమైతే ఫలితాలు ఎలా ఉంటాయో నిరూపించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి

ఓటింగ్‌లో హిందువులు ఐక్యత చాటారు

జూన్‌ 4న కేసీఆర్‌.. డాక్టర్లను పక్కనబెట్టుకోవాలి

గ్యారెంటీలపై సర్కారు దృష్టి పెట్టాలి: సంజయ్‌

భగత్‌నగర్‌, మే 14: కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో హిందువులు ఐక్యత చాటారని, హిందువులు ఏకమైతే ఫలితాలు ఎలా ఉంటాయో నిరూపించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో బీజేపీని ఓడించేందుకు ముస్లింలంతా ఏకం కావాలంటూ కేసీఆర్‌ పిలుపునిచ్చారని, హిందువులంతా ఏకమైతే ఏ విధమైన ఫలితాలు వస్తాయో జూన్‌ 4న తేలుతుందన్నారు. ఫలితాలను చూసి తట్టుకునే శక్తి కేసీఆర్‌కు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆ రోజు కేసీఆర్‌ ఇద్దరు డాక్టర్లను పక్కన పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని చెప్పారు. ఉన్నతాధికారులు సక్రమంగా పనిచేసినా కొన్ని ప్రాంతాల్లో కింది స్థాయి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని, లాఠీచార్జ్‌లు సైతం చేశారని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎ్‌సకు పోలీసులు ఎలా సహకరించారో అదే విధంగా కాంగ్రె్‌సకు కొంత మంది పోలీసులు సహకరించారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని.. లేకపోతే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు తప్పవని సంజయ్‌ హెచ్చరించారు.

Updated Date - May 15 , 2024 | 03:10 AM