Share News

మేడిగడ్డ మరమ్మతులపై ఉన్నతస్థాయి కమిటీ

ABN , Publish Date - May 09 , 2024 | 05:06 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలకు

మేడిగడ్డ మరమ్మతులపై ఉన్నతస్థాయి కమిటీ

ఏర్పాటుకు నీటిపారుదల శాఖ నిర్ణయం

డీఎస్‌ఆర్‌పీ సభ్యులు, ఇతర అధికారులతో కమిటీ

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలకు నీటిపారుదల శాఖ ఉపక్రమించింది. ఎన్‌డీఎ్‌సఏ కమిటీ సిఫారసులతో బ్యారేజీల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం డ్యామ్‌సేఫ్టీ చట్టం ప్రకారం రాష్ట్రంలో వేసిన డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌(డీఎ్‌సఆర్‌పీ) సభ్యులతోపాటు ఇతర అధికారులతో కమిటీని వేయనున్నారు. వానాకాలంలోపే మరమ్మతులు చేయాలని నిర్దేశించడంతోపాటు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వచ్చే వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ అయ్యర్‌ కమిటీ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - May 09 , 2024 | 08:37 AM