Share News

చేతి వృత్తుల వారికి చేయూత

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:31 PM

అంతరించిపోతున్న చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ పఽథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా హస్త కళలకు జీవం పోసినట్టు అవుతుందని కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు.

చేతి వృత్తుల వారికి చేయూత
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌.

విద్యారుణాలతో యువతకు తోడ్పాటు...

అర్హులకు బ్యాంకర్లు రుణాలు అందించాలి...

కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌ ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతిప్రతినిధి) : అంతరించిపోతున్న చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ పఽథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా హస్త కళలకు జీవం పోసినట్టు అవుతుందని కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ స్కీం కోసం దరఖాస్తు చేసుకునే లబ్దిదారులు ఆధార్‌, రేషన్‌ కార్డులు జత చేసి గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక లక్ష్యం 18,370 కోట్లు, కాగా 44,287 కోట్లు మంజూరు చేసి 241 శాతంతో లక్ష్యాన్ని అధిగమించారన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమపనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. పట్టణ ప్రాంతమైన మేడ్చల్‌ జిల్లాలో యువతకు ఉన్నత విద్యాకు ఎక్కువ శాతం రుణాలు అందించడం ద్వారా యువత ఉన్నత విద్యా ప్రమాణాలను పొంది వారి బంగారు భవిష్యత్తుకు మైలురాజు అవుతుందన్నారు. రైతులకు పంటరుణాలు, టర్మ్‌ లోన్‌లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, పరిశ్రమల, డీఆర్‌డీఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాఽధి యూనిట్ల స్థాపన , చిన్న మధ్య తరహావిద్య, గృహ నిర్మాణం ఇతర ప్రాధాన్య రంగాల్లో అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రె డ్డి, కెనెరా బ్యాంకు డీజీఎం సంజయ్‌కుమార్‌, లీడ్‌ బ్యాంకు మేనేజరు శ్రీనివాసులు, ఆర్బీఐ ఎల్‌డిఓ గోమతి, నాబార్డ్‌ అధికారి రమేష్‌, జీఎండీఐసి రవీందర్‌, జిల్లా వ్యవసాయాదికారిని మేరీ రేఖా, బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:31 PM