చలో గోవా...
ABN , Publish Date - Mar 02 , 2024 | 11:37 PM
మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు శనివారం గోవా టూర్‌కు బయలుదేరారు. ఆయా మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అవిశ్వాసాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ చైర్మన్లు ఈ టూర్లకు శ్రీకారం చుట్టారు.
మేడ్చల్ టౌన్, మార్చి 2 : మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు శనివారం గోవా టూర్‌కు బయలుదేరారు. ఆయా మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అవిశ్వాసాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ చైర్మన్లు ఈ టూర్లకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు గోవా టూర్‌కు బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. నెలరోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి దుబాయ్ టూరుకు వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి మరో యాత్రకు బయలు దేరడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైర్‌పర్సన్ భర్త మర్రినర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 12మంది యాత్రకు బయలు దేరగా వీరిలో కొదరు కౌన్సిలర్లు ఉండగా మరి కొందరు కౌన్సిలర్ల భర్తలున్నారు.