Share News

భారీగా డ్రగ్స్‌, గంజాయి స్వాధీనం?

ABN , Publish Date - Nov 26 , 2024 | 12:13 AM

యాదాద్రి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కా కుండా భారీఎత్తున హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్‌, గంజాయిని యాదాద్రిభువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

 భారీగా డ్రగ్స్‌, గంజాయి స్వాధీనం?

యాదాద్రి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కా కుండా భారీఎత్తున హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్‌, గంజాయిని యాదాద్రిభువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో నార్కొటిక్‌, భువనగిరి జోన్‌ పోలీసులు గంజాయిని పట్టుకున్నట్టు తెలిసింది. సోమవారం మ ధ్యాహ్నం నుంచే నార్కొటిక్‌, భువనగిరి జోన్‌ పోలీసులు గూ డూరు టోల్‌ప్లాజా వద్ద నిఘాను పెంచారు. అనుమానం ఉ న్న వాహనాలను తనిఖీలు చేసినట్టుగా సమాచారం. పోలీసు లు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.కోట్ల విలువ చే సే డ్రగ్స్‌, గంజాయిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, స్థానికంగా ఎవరికీ సమాచారం అందంచలేదు. ఎన్ని వాహనాల్లో వీటిని తరలిస్తున్నారు? ఎంతమేరకు లభ్యమైందన్న వివరాలను చా లా గోప్యంగా ఉంచుతున్నారు. స్వాధీనం చేసుకున్న వివరాలు హైదరాబాద్‌లో పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యే క శ్రద్ధ వహించింది. ఈనేపథ్యంలో గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠాలపై నిఘా సారించింది. జాతీయ రహదారులపై గట్టి నిఘాను ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌ శివారులోని టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వాహనాలు చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్‌కు చే రుకుంటాయి. అదేవిధంగా ఛత్తీ్‌సగడ్‌, మహారాష్ట్రకు చెందిన వాహనాలు గూడూరు టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్‌కు వెళ్తాయి. ఆయా రాష్ర్టాల నుంచి తెలంగాణకు సరఫరా చేస్తు న్న గంజాయిని నియంత్రించే పనిలో సర్కారు నిమగ్నమైంది. ఇటీవల పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. మరోసారి నార్కోటిక్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌, గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.

Updated Date - Nov 26 , 2024 | 12:13 AM