Share News

ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:59 PM

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే కుందూ రు జయవీర్‌రెడ్డి అన్నారు.

 ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కుందూరు జయవీర్‌రెడ్డి

ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి

ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి

నిడమనూరు, జనవరి 30: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే కుందూ రు జయవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పార్వతీపురంలో విషజ్వరాలపై మంగళవారం అధికారులు, వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. విషజ్వరాలు వ్యాపించడానికి గల కా రణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్యం లో పించడంతో పాటు కాల్వల్లో నీరు నిల్వ ఉన్నందున లార్వా వ్యా ప్తి చెంది జ్వరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని వీధులన్నీ పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్యా న్ని మెరుగుపరచడంతో పాటు వెంటనే ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో కేశ రవి, వైద్యాధికారి మాధవ్‌కుమార్‌, ఎంపీడీవో ప్రమోద్‌కుమార్‌, రామేశ్వరి, అంకతి సత్యం, రంగశాయిరెడ్డి, వెంకటరమణ, వెంకట్‌రాహుల్‌, వల్లభ్‌రెడ్డి, శ్రీను, చినవీరయ్య, కొండా శ్రీనివా్‌సరెడ్డి, శివమార య్య, నర్సింగ్‌ విజయ్‌కుమార్‌, వంశీ, కృష్ణవివేక్‌ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం

మాడ్గులపల్లి: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యమని ఎమ్మె ల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గారకుంటపాలెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడా రు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని అ న్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని, ప్రస్తుతం రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఫిబ్రవరిలో మరో రెండింటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ జొన్నలగడ్డ విజయశ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, పీఆర్‌ ఏఈ నరేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:59 PM