Share News

Kumaram Bheem Asifabad- పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:32 PM

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పిస్తే ఆదిలాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రభుత్వ పరిశ్రమ శాఖ ఉమ్మడి జిల్లా విశ్రాంత అధికారి జాదవ్‌ రాంకిషన్‌నాయక్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad-  పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా
డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న రాంకిషన్‌నాయక్‌

ఆసిఫాబాద్‌, జనవరి 9: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పిస్తే ఆదిలాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రభుత్వ పరిశ్రమ శాఖ ఉమ్మడి జిల్లా విశ్రాంత అధికారి జాదవ్‌ రాంకిషన్‌నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనది సొంత మండలం జన్నారం అని చెప్పారు. మూడు దశబ్దాలకు పైగా ఉట్నూర్‌లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. చదవుకునే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా పని చేసినట్లు తెలిపారు. బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఏపీఎస్పీ ద్వారా 1990లో పరిశ్రమల శాఖలో ఉద్యోగం సాధించినట్లు చెప్పారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఉమ్మ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌గా 2020లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తే పోటీ చేసి గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బయోడేటాను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుకు అందజేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మునీర్‌ అహ్మద్‌, నాయకులు కౌసర్‌, లక్ష్మికాంత్‌, కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 10:32 PM