Share News

ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిని రహస్యంగా కలిశారు

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:48 PM

ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని రహస్యంగా ఎవరు కలిశారు.. అనేది త్వరలో వెల్లడి స్తామని తాండూరు వికారాబాద్‌, కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి గిఫ్ట్‌గా ఇస్తానని రేవంత్‌రెడ్డికి చెప్పింది ఎవరో అధిష్ఠానానికి తెలుసునని బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిని  రహస్యంగా కలిశారు

మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు : ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని రహస్యంగా ఎవరు కలిశారు.. అనేది త్వరలో వెల్లడి స్తామని తాండూరు వికారాబాద్‌, కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి గిఫ్ట్‌గా ఇస్తానని రేవంత్‌రెడ్డికి చెప్పింది ఎవరో అధిష్ఠానానికి తెలుసునని బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానికి అన్ని విషయాలు తెలుసునని, సమయం వచ్చిన ప్పుడు పార్టీ పెద్దలు మాట్లాడతారని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసిన వారు ఎంతటి హోదాలో ఉన్న వదిలిపెట్టమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ అనేక ప్రచారా సభల్లో కాంగ్రె్‌సకు ఓటు వేసి మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు . ఆసరా పింఛన్లు పంపిణీ నిలిపి వేశారని, వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బందు కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియోజకవర్గంలో 1500 మందిని ఎంపిక చేసి నిధులు సిద్ధ్దం చేశామని వాటిని లబ్ధ్దిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఎంపిక చేసిన లబ్ధ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తాండూరులో చిలుక వాగు డ్రైన్‌ నిర్మాణానికి రూ. 16 కోట్ల నిధులు తీసుకు వస్తే వాటిని రద్దు చేశారని, శ్మశాన వాటికల అభివృద్దికి ఐడీసీ నుంచి రూ. కోటి 30లక్షలు తీసుకు వస్తే వాటిని రద్దు చేశారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పని తీరు మార్చుకోక పోతే ప్రజల నుంచి తిరుగుటు బాటు తప్పదని హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2024 | 11:48 PM