Share News

హరీశ్‌రావు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

ABN , Publish Date - Feb 10 , 2024 | 03:50 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు... సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను

హరీశ్‌రావు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేదు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు... సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని.. అసలు ఆ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున ఇచ్చే ప్రతిపాదనకు ఒప్పుకొన్నది బీఆర్‌ఎస్సేనని అన్నారు. దాని ఫలితంగా పదేళ్లుగా నీటి వాటాల్లో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకోవడం లేదని చెప్పామని, ఈ మేరకు సంతకాలు కూడా ఉన్నాయన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 03:51 AM