Share News

Kumaram Bheem Asifabad- ఘనంగా మార్కండేయ జయంతి

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:28 PM

ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో గల మార్కండేయ ఆలయంలో సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు.

Kumaram Bheem Asifabad-  ఘనంగా మార్కండేయ జయంతి
శోభాయాత్రలో కోలాటం ఆడుతున్న మహిళలు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 12: ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో గల మార్కండేయ ఆలయంలో సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ స్వామి చిత్రపటంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు ఏకరూప దుస్తులతో భక్తి పాటలతో కోలాటాలు ఆడడం ఆకట్టుకుంది. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉదయం ఆలయం వద్ద గణపతి పూజ, మార్కండేయ స్వామిప్రత్యేక పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు ఆంజనేయులు, లింగయ్య, ధర్మయ్య, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సంజీవ్‌, మోహన్‌, మధుకర్‌, విజయ, సునీత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: గొలేటీ పద్మశాలి వెల్ఫేర్‌ సోసైటీ ఆధ్వర్యంలో సోమవారం మార్కండే మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పద్మశాలి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గోలేటి పద్మశాలి సంఘం నాయకులు వీరస్వామి, సమ్మయ్య, సత్యనారాయణ, స్వరూపరాణి, మంగ బోగ, శ్రీదేవి, జయశ్రీ, శోభరాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:28 PM