Share News

వేణుగోపాలునికి హనుమంత సేవ

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:41 AM

హరిహరక్షే త్రం గోపలాయపల్లి వా రిజాల వేణుగోపాలస్వా మి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సో మవారం రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాలస్వామికి హ నుమంత సేవ నిర్వహించారు.

 వేణుగోపాలునికి హనుమంత సేవ
ఉత్సవమూర్తులను మంటపానికి తీసుకువస్తున్న అర్చకులు

వేణుగోపాలునికి హనుమంత సేవ

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 26: హరిహరక్షే త్రం గోపలాయపల్లి వా రిజాల వేణుగోపాలస్వా మి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సో మవారం రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాలస్వామికి హ నుమంత సేవ నిర్వహించారు. ఉదయం ఆలయ మహామంటపంలో హోమం, బలిహరణం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన హనుమంత వాహనంపై రుక్మి ణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను చే యించారు ఆలయ వీధుల్లో ఊరేగించారు. స్వామివారి హనుమంత సేవలో భ క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి, రాజేశ్వరి దంపతులు, ఆలయ సిబ్బంది సింహాచలం, వేణు, మచ్చగిరి, నాగరాజు, నాయకుడు నర్రా నర్సిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:41 AM