చేనేత వసా్త్రలను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:43 AM
చేనేత వసా్త్రలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూ పించవచ్చని అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నారు.
చేనేత వసా్త్రలను ప్రోత్సహించాలి
అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర
నల్లగొండ టౌన, అక్టోబరు 20 (ఆంధ్రజ్యో తి): చేనేత వసా్త్రలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూ పించవచ్చని అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీ టీ డీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలు గు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం గా నిలిచే చేనేత వసా్త్రల వినియోగం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపిక చేసిన వస్త్ర శ్రేణిపై 30 శాతం రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో చేనేత జౌళీ శాఖ అడిషనల్ డైరెక్టర్ టి.వెంకటేశం, సహాయ సంచాలకులు ద్వారక్, ప్రసా ద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.