Hackers : హ్యాకర్ల బారిన హ్యాక్ ఐ..!
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:32 AM
తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిచయం చేసిన హ్యాక్-ఐ యాప్ హ్యాకింగ్‌కు గురైందా? యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నవారి వ్యక్తిగత వివరాలు సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కాయా? ఈ ప్రశ్నలకు
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిచయం చేసిన హ్యాక్-ఐ యాప్ హ్యాకింగ్‌కు గురైందా? యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నవారి వ్యక్తిగత వివరాలు సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కాయా? ఈ ప్రశ్నలకు ఓ నెటిజన్ ఔనని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. హ్యాక్-ఐ యాప్‌ను ఉపయోగిస్తున్న 2 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లు తస్కరించారంటూ ఆ నెటిజన్ పేర్కొన్నారు. మహిళల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం, లొకేషన్ వివరాలపై హ్యాకర్లు యాక్సెస్ పొందినట్లు వెల్లడించారు. పోలీసులు మాత్రం దీనిపై వివరణ ఇచ్చేందుకు స్పందించడం లేదు.