దేశంలో పెరుగుతున్న మతతత్వ రాజకీయాలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:53 PM
దేశంలో మతతత్వ రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజల వ్యక్తిగత ఇష్టాలను రాజకీయాలకు జతచేసి బీజేపీ లబ్ధిపొందాలని చూస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం అన్నారు.

మోటకొండూర్, ఏప్రిల్ 3: దేశంలో మతతత్వ రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజల వ్యక్తిగత ఇష్టాలను రాజకీయాలకు జతచేసి బీజేపీ లబ్ధిపొందాలని చూస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం అన్నారు. బుధవారం మండలంలోని చాడ మధిర గ్రామం పిట్టాలగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరరించడంలో విఫలం చెందాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా నాయకుడు, సీపీఎం అభ్యర్థి జహంగీర్ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొలగాని జయరాములు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, కాల్య విజయ్, కాల్య గోపాల్, నాయక్, కృష్ణ, మల్లేష్, సంధ్య పాల్గొన్నారు.