Share News

గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:44 PM

జిల్లాలో గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు.

గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ సంతోష్‌, జిల్లా అధికారులు

నాగర్‌కర్నూల్‌, నవంబరు 13 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీ స్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో గ్రూప్‌-3 పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి వీడియో కాన్ఫరె న్స్‌లో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, జిల్లా అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, డీఈవో గోవిందరా జులుతో కలిసి కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పా ల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 9478మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్‌-3 పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 33 పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందు లో పీడబ్ల్యూడీ అభ్యర్థుల కోసం మూడు కేం ద్రాలను కేటాయించామని తెలిపారు. జిల్లాలో 9478 మంది అభ్యర్థుల్లో 5453మంది పురు షులు, 4025మంది మహిళా అభ్యర్థులు పరీ క్షలకు హాజరవుతున్నారని, గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 11:44 PM