గ్రూప్-2. 3లో అదనపు పోస్టులు!
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:59 AM
నిరుద్యోగులకు ఓ శుభవార్త. టీఎ్‌సపీఎస్సీ నియామకాల్లో గ్రూప్- 2, 3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ఖాళీ పోస్టుల వివరాలివ్వాలని శాఖలకు ప్రభుత్వ ఆదేశం
హైదరాబాద్, మార్చి7 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఓ శుభవార్త. టీఎ్‌సపీఎస్సీ నియామకాల్లో గ్రూప్- 2, 3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2, 3 పోస్టుల వివరాలను ఆర్థిక శాఖకు అందించాలని అన్ని శాఖాధిపతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సచివాలయంలోని అన్ని శాఖలకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2లో 783 పోస్టులను, గ్రూప్-3లో 1,388 పోస్టులను టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.