Share News

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:57 PM

జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో గల దర్గాలో హజ్రత సయ్యద్‌ షావలీ ఉర్సు ఉత్సవాలు శు క్రవారం ఘనంగా జ రిగాయి.

 ఘనంగా ఉర్సు ఉత్సవాలు
దర్గా వద్ద మొక్కులు తీర్చుకుంటున్న అమితరెడ్డి

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

నల్లగొండ కల్చరల్‌, జనవరి 5: జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో గల దర్గాలో హజ్రత సయ్యద్‌ షావలీ ఉర్సు ఉత్సవాలు శు క్రవారం ఘనంగా జ రిగాయి. దర్గాలో ముతవల్లులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గుత్తా అమితరెడ్డి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు కట్టెల శివకుమార్‌, ముతవల్లులు ఆహ్మద్‌ షేక్‌హబీ, మునీరుద్దీన, సయ్యద్‌ జాఫర్‌ఖాన, హషం, కౌన్సిలర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, ఇంతియాజ్‌ ఆలీ, ఇర్ఫాన, నరే ష్‌ కుమార్‌, నాగయ్య, కొండల్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:57 PM