Share News

అనుమతుల్లో మహా వేగం!

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:29 AM

రాజధాని మహానగర (హైదరాబాద్‌) విస్తరణ, అభివృద్ధిలో కీలకమైన హెచ్‌ఎండీఏలో.. భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన ఐదు నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ప్రతి గురువారం మల్టీ స్టోర్‌ బిల్డింగ్‌ (ఎంఎ్‌సబీ) కమిటీ సమావేశాలను

అనుమతుల్లో మహా వేగం!

ఐదు నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు

ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ ఫైళ్ల సత్వర పరిష్కారం

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల పెండింగ్‌

టీఎస్‌బీపాస్‌లో పొందుపరచి పునఃపరిశీలన

అప్‌లోడింగ్‌ ప్రక్రియ షురూ చేసిన హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాజధాని మహానగర (హైదరాబాద్‌) విస్తరణ, అభివృద్ధిలో కీలకమైన హెచ్‌ఎండీఏలో.. భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన ఐదు నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ప్రతి గురువారం మల్టీ స్టోర్‌ బిల్డింగ్‌ (ఎంఎ్‌సబీ) కమిటీ సమావేశాలను జరుపుతూ.. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతులను తర్వితగతిన జారీ చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చాక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతోందంటూ రాజకీయ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం.. హెచ్‌ఎండీఏలో కీలక అధికారులకు స్థానచలనం, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడడం, గత ప్రభుత్వ హయాం నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణలు.. వీటన్నింటి నేపథ్యంలో ఏ క్షణం ఏ అధికారిపై వేటు పడుతుందోననే సందేహాలున్నాయి. కానీ, ఎన్ని ఉన్నా అనుమతులు ఆగట్లేదని విశ్వసనీయవర్గాల సమాచారం. గత సర్కారు హయాంలో కొన్ని ఫైళ్లను ఆన్‌లైన్‌లో టీఎ్‌సబీపాస్‌ నుంచి తప్పించి ఆఫ్‌లైన్‌లోకి మార్చి అడ్డగోలుగా అ నుమతులిచ్చినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ఆ అనుమతులను ఆపి, వాటిని మళ్లీ ఆన్‌లైన్‌లోకి మార్చే ప్రక్రియ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలను సవరిస్తూనే హెచ్‌ఎండీఏలో భవన ని ర్మాణ, లే-అవుట్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో వేగం పెంచాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం భారీ టాస్క్‌నిచ్చింది. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అనుమతివ్వాలంటూ ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా వివి ధ ఫైళ్లపై పూర్తిస్థాయి నివేదికలను అందజేస్తూనే.. మరోవైపు అనుమతుల జారీ వేగవంతం చేశారు. లెక్కల్లో చెప్పాలంటే.. గతఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 20వరకూ హెచ్‌ఎండీఏలో 827 భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. వాటి లో 708 అనుమతులు.. డిసెంబరు నుంచి మార్చి నడుమ ఇచ్చినవే. అదే.. అసెంబ్లీ ఎన్నికల ముందు నాలు గు నెలల్లో (ఆగస్టు నుంచి నవంబరు వరకు) 745 భవన నిర్మాణ అనుమతులిచ్చారు. ఈ నాలుగు నెల ల్లో 359 దరఖాస్తులకుగాను 229 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేశారు. ఎన్నికల తర్వాత నాలుగు నెలల్లో హెచ్‌ఎండీఏకు 376 దరఖాస్తులు రాగా.. 215 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇంకా 99 దరఖాస్తులు ప్రాసె్‌సలో ఉన్నాయి. నిర్ణీత గడువులోగా వాటినీ పరిష్కరించనున్నారు.

ఆపింది వాటినే..

ఆన్‌లైన్‌లో అనుమతులు, పారదర్శకత కోసం తీసుకొచ్చిన టీఎ్‌సబీపా్‌సకు.. గత సర్కారు హయాం లో ఆఫ్‌లైన్‌ దందాతో తూట్లు పొడిచినట్లు ఆరోపణలున్నాయి. 2020 నుంచి 2023 డిసెంబరు నడుమ.. ఏడు అంతస్తుల నుంచి 58 అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు పొందిన వాటిలో అత్యధిక ఫైళ్లు ఆఫ్‌లైన్‌లోకి మార్చినవే. టీఎ్‌సబీపా్‌సలో దరఖాస్తు చేసిన తర్వాత.. రెవెన్యూపరమైన అంశాలను పరిశీలించే తహశీల్దార్‌ స్థాయిలోనే ఆయా ఫైళ్లను సాంకేతిక ఇబ్బందుల పేరిట ఆఫ్‌లైన్‌లోకి మార్చేసి అనుమతులిచ్చేశారు. దీనిపై కొత్తగా వచ్చిన ప్రభు త్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో జారీచేసిన అనుమతులన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చేందుకు చర్యలు చేపట్టింది. వాటన్నింటినీ పునఃపరిశీలించి అనుమతులిచ్చేందుకు ఇటీవలే మార్గదర్శకా లు జారీ చేసింది. వివిధ దశల్లో ఆగిన దాదాపు 200 మాన్యువల్‌ ఫైల్స్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చాలని, ఆన్‌లైన్‌లోనే వివిధ దశల్లో అధికారులు పునఃపరిశీలన చేసి, అన్నీ పక్కాగా ఉంటేనే అనుమతులివ్వాలని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో, ఇప్పటికే ఫీజులు కట్టి.. ప్రొసీడింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులకు సైతం మొదటి నుంచి ఆన్‌లైన్‌లో రీ వెరిఫికేషన్‌ చేసిన తర్వాతే అనుమతులు జారీ చేయనున్నారు. ఈ మేర కు, ఆయా ఫైల్స్‌ను పూర్తిగా టీఎ్‌సబీపా్‌సలోకి మళ్లీ అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను జోన్లవారీగా ప్రారంభించారు. అప్‌లోడింగ్‌ పూర్తికాగానే.. ఆన్‌లైన్‌లో తొలుత పార్ట్‌-బీ పరిశీలన, ఆ తర్వాత ఏపీవో, ప్లానింగ్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ల పునఃపరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వచ్చే దస్త్రాలకు మాత్రమే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆమోదముద్ర వేయనున్నారు. ఆ వెంటనే ఫీజు లెటర్లు జారీ, ఫీజులు చెల్లించినవారికి ప్రొసీడింగ్‌ కాపీలను జారీ చేసేవిధంగా కసరత్తు చేస్తున్నారు.

సత్వర అనుమతులతో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి

ఆన్‌లైన్‌లో సత్వర భవన నిర్మాణ అనుమతులు.. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ప్రభుత్వం మారిన తర్వాత హెచ్‌ఎండీఏలో అనువతులు ఇంత వేగవంతమవుతాయనుకోలేదు. హెచ్‌ఎండీఏలో రెగ్యులర్‌గా ఎంఎ్‌సబీ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతులపై కమిటీ ఓ నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలున్నాయి.

రాజశేఖర్‌ రెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు

Updated Date - Apr 22 , 2024 | 05:29 AM