ఘనంగా ఈస్టర్ వేడుకలు
ABN , Publish Date - Apr 01 , 2024 | 12:17 AM
జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
తిరుమలగిరి రూరల్, చివ్వెంల, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, మార్చి 31: జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తుకు శిలువ వేసిన తర్వాత మూడ వ రోజును ప్రజలు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. తిరుమలగి రి మండలంలోని తాటిపాముల, తొండ, గుండెపురి, జలాల్‌పురం గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ పురుషోత్తం, భాస్కర్, శేఖర్, అనంతి, రంజిత్, సోమయ్య, అమృతి, తదితరులు పాల్గొన్నారు. చివ్వెంల మండలంలోని ఖాశీంపేటలోని బెతేస్థ మిని స్ర్టీస్‌లో జరిగిన ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. మరణంపై ఏసుక్రీస్తు గెలిచిన విజయో త్సవమే ఈస్టర్ పండుగని జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గం ప్రభాకర్ అన్నారు. ఏసుక్రీస్తు చూపిన మార్గం ఆచరణీయమని తెలిపారు. కార్యక్రమంలో దుర్గం కరుణ, హోసన్మ, మీసాల తీతు, నాగరాజు, యేసుపాదం, బా బు, ఉపేందర్, రాజు, పేతురు అబ్రహం, కిరణ్, దావీదు, భాస్కర్ పాల్గొన్నారు. నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల బాప్టిస్ట్ చర్చిలో ఫాస్టర్ శ్యామ్ డేవిడ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, పెడలా, సోమయ్య, బా బు, రమేష్, శ్రీనివాస్, నాగయ్య, సురేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్, పట్టణంలో కొత్త బస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వరకు రన్‌ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్‌ఛైర్మన్ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గా ల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో సామ్యేలు, సుధాకర్, పౌల్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.