Share News

ఘనంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - May 25 , 2024 | 11:23 PM

వెంకటాపూర్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది.

ఘనంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 25 : వెంకటాపూర్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథోత్సవంపై స్వామివారిని ప్రతిష్టించారు. భక్తుల కోలాటాలు మధ్య ఊరేగింపు కొనసాగింది. రథం ఇళ్ళ ముందుకు రాగానే బిందెలతో నీళ్ళు, సాకపెట్టి కొబ్బరికాయలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు, గ్రామస్తులు భక్తిపారవశంలో ముగినితేలారు. సాయంత్రం స్వామివారిని శేషవాహన సేవపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారివేణుగోపాల్‌, ఈవో లగడపాటి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు కందుల నవీన్‌, నీరుడి శఽంకర్‌, లింగం, రామకృష్ణరెడ్డి, కట్ట శేఖర్‌, కళావతి, ఎంపీటీసీ నీరుడి రామారావు, మాజీ సర్పంచ్‌లు నీరుడి గీతాశ్రీనివాస్‌, దేశం బాల్‌రాజ్‌, బుర్ర వెంకటే్‌షగౌడ్‌, దేశం బాల్‌రాజ్‌, కట్ట సత్యనారాయణ, కుమార్‌, చింతపట్టి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:23 PM