Share News

మక్తమాదారంలో ఘనంగా రథోత్సవం

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:07 PM

మక్తమాదారంలోని వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమాన్ని శనివారం తెల్లవారు జామున అట్టహాసంగా నిర్వహించారు.

మక్తమాదారంలో ఘనంగా రథోత్సవం

కడ్తాల్‌, ఫిబ్రవరి17: మక్తమాదారంలోని వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమాన్ని శనివారం తెల్లవారు జామున అట్టహాసంగా నిర్వహించారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మక్తమాదారంతో పాటు సమీప గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. రథంపై దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించగా, భక్తులు తాళ్లతో లాగి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో దేవాలయ ధర్మకర్త, అర్చకులు శ్రీ వింజమూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ సర్పంచ్‌ సులోచన సాయిలు, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల చంద్రమౌళి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:07 PM