Share News

ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:56 PM

రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చే యాలని, వారిని ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని డీఎస్వో వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

 ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి
నకిరేకల్‌: కొనుగోలు కేంద్రం వద్ద మాట్లాడుతున్న డీఎస్వో వెంకటేశ్వర్లు

ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి

నకిరేకల్‌, నల్లగొండరూరల్‌, కనగల్‌, ఏప్రిల్‌ 16: రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చే యాలని, వారిని ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని డీఎస్వో వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నకిరేకల్‌లోని చీమలగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.03 లక్షల టన్ను ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. విక్రయించిన రైతుల కు రూ.80 కోట్లు పంపిణీ చేశామని, గన్నీ బ్యాగుల కొరత లేదని అన్నారు. ఓఆర్‌ఎ్‌సతో కూడిన మంచినీటిని రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీసీవో కిరణ్‌కుమార్‌, త హసీల్దార్‌ జమీరుద్దీన, అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌ మహమూద్‌ అలీ, మనిటరింగ్‌ ఆఫీసర్‌ ఉమానంద్‌, సీఈవో జగనమోహనరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ మండలంలోని దండెంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని డీసీవో కిరణ్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు రికార్డులు, రైతులకు క ల్పించే సౌకర్యాల గురించి ఆరా తీశారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే ట్రాన్సపోర్టు చేయాలన్నారు. ఆయన వెంట అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ మహ్మద్‌ అలీ, జూనియర్‌ అసిస్టెంట్‌ సుమన, సెంటర్‌ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

కనగల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్‌ పద్మ సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. మండలంలో 21 ఐకేపీ కేంద్రాల్లో 2009 మంది రైతుల నుంచి 1 లక్ష 55 వేల 582 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏపీఎం హరి తెలిపారు. ఇప్పటికే 80 శాతం కొనుగోలు చేసామని, మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రసాద్‌, సీసీలు విజయ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:56 PM