Share News

Manchiryāla- లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - May 15 , 2024 | 10:16 PM

యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యానికి చేరువలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఉంది. గత ఏడాదితో పోలితే ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ కేంద్రాలను తొలగించి మహిళా సంఘా లు నిర్వహించే ఐకేపీ సెంటర్లకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.

Manchiryāla-        లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా వేస్తున్న సిబ్బంది

- ఈ నెల 25 వరకు పూర్తి చేసేలా కార్యాచరణ

- రైతులకు రూ. 70 కోట్ల చెల్లింపులు పూర్తి

మంచిర్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యానికి చేరువలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఉంది. గత ఏడాదితో పోలితే ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ కేంద్రాలను తొలగించి మహిళా సంఘా లు నిర్వహించే ఐకేపీ సెంటర్లకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. తూకంలో అవినీతి ఆరోపణల కారణంగా డీసీఎంస్‌, పీఏసీఎస్‌ కేంద్రాలను తొలగించిన అధికారులు, ఈ ఏడాది జిల్లాలో ఐకేపీ సెంటర్లకు పెద్దపీట వేశారు. మంచిర్యాల నియోజ కవర్గానికి సంబంధించి ముందుగా ఆయా సెంటర్లను మూకుమ్మడిగా తొలగించిన అధికారులు పూర్తిగా ఐకేపీ మహిళలకే వరి దాన్యం కొనుగో లు బాధ్యతలు అప్పగించారు. దీంతో నియోజక వర్గంలో 80 శాతం మేర లక్ష్యం చేరుకున్నారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లో అక్కడ క్కడ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాని కారణంగా తప్పని పరిస్థితుల్లో డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ కేంద్రాలను కొనసాగిస్తున్నా రు. ఆయా ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేయడం, కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా కొంతమేర కొనుగోళ్లు మందగిం చినట్లు తెలుస్తోంది.

286 కేంద్రాల ద్వారా..

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన వరి దాన్యం కొ నుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 286 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనివార్య కారణాల వల్ల 32 కేంద్రాలను మూసివేయగా, ప్రస్తుతం 254 సెంటర్ల ద్వారా సీజన్‌లో మొత్తం 1,76 వేల మెట్రిక్‌ టన్నుల దాన్యం కొ నుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అకాల వర్షాల కారణంగా దాన్యం తడిసిపోయే అవకాశం ఉండడంతో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 10,998 మంది రైతులకు చెందిన 75,437 మెట్రిక్‌ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేశారు. అలాగే కొనుగోలు చేసిన దాన్యానికి సంబంధించి బుధవారం నాటికి రూ. 70.3 కోట్ల చెల్లింపులు జరుగగా, నగదు రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు.

మరో పది రోజుల్లో..

జిల్లాలో సాగైన వరి ధాన్యాన్ని ఈ నెల 25వ తేదీ లోపు పూర్తిస్థాయి లో కొనుగోలు చేయాలనే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల పరిధిలో దాదాపు 80 శాతం మేర కొనుగోలు చేయాల్సి ఉంది. మంచిర్యాల నియోజకవర్గంలో 20 శాతం మిగిలి ఉంది. జిల్లా వ్యాప్తంగా కల్లాల్లో మిగిలిపోయిన సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల వరి దాన్యాన్ని పూర్తిగా నిర్ణీత గడువులోగా కొనుగోలు చేసేందుకు సమాయత్తం అవుతుండగా, నగదు కూడా త్వరితగతిన బ్యాంకుల్లో జమ చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి..

- అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంట వెం టనే రైస్‌ మిల్లులకు పంపేలా నిర్వాహకులు అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా రైతులకు ధాన్యం నష్టం జరుగకుండా చూడాలి. రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యతతో తూకానికి వేయాలి. తప్ప, తాలు లేకుండా ధాన్యం తీసుకొస్తే కొనుగోళ్లు త్వరితగతిన పూర్తవుతాయి. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. తడిసిన ధాన్యం పూర్తిగా ఆరబెట్టాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.

Updated Date - May 15 , 2024 | 10:16 PM