ప్రభుత్వం కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:16 AM
ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కోరారు.

కట్టంగూరు, మార్చి 5: ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కోరారు. మండలంలోని ముత్యాలమ్మగూడెంలో మంగళవారం సంఘం సభ్యత్వాలు నమోదు చేయించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల బతుకులు మారడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన్న వెంకులు, నాయకులు ఇటికాల సురేందర్, గాదనబోయిన కుమార్, అండాలు, మంజుల, జాల శ్రీను, మంగమ్మ తదితరులు ఉన్నారు.
చిట్యాలరూరల్: చిట్యాల మండలం పిట్టంపల్లిలో మంగళవారం ఉపాధిహామీ కూలీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ శివారులో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీల వద్దకు సంఘం నాయకులు వెళ్లి సభ్యత్వాలు అందజేశారు. సంఘం మండల కార్యదర్శి మెట్లు పరమేష్ మాట్లాడుతూ కూలీలకు పని ప్రదేశంలో అన్ని వసతులను కల్పించాలని, బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాల న్నారు. రోజుకు కూలీ రూ.600లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మల్లేష్, ఉడుగు సత్తయ్య, మెట్టు నర్సింహ, చంద్రయ్య ఉన్నారు.