Share News

హడ్కో రుణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:09 AM

రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది.

హడ్కో రుణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

95,235 ఇందిరమ్మ ఇళ్లకు రూ. 3 వేల కోట్ల రుణం

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది. పట్టణాల్లో 57,141, గ్రామీణ ప్రాంతాల్లో 38,094 కలిపి మొత్తం 95,235 ఇళ్ల నిర్మాణానికి రూ. 3 వేల కోట్ల రుణం అవసరం కానుంది. ఈ రుణాన్ని హడ్కో నుంచి పొందేందుకు అనుమతించాలని ఇటీవలే గృహనిర్మాణ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు అనుమతిస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కేఎ్‌స.శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Mar 06 , 2024 | 04:09 AM