Share News

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 20 , 2024 | 12:26 AM

రైతుల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఆలేరులో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆలేరు రూరల్‌, మే 19: రైతుల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశకంలో మాట్లాడారు. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. రైతన్నలు విత్తనాలు కొనుగోలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షా కాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. రైతులందరూ అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కె. సాగర్‌రెడ్డి, ఎంఏ ఎజాజ్‌, తుంగ కుమార్‌, ఆలేటి శ్రీకాంత్‌, రమేష్‌, సురేష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:26 AM