రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:36 AM
రైతాంగ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముం దుకు సాగుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అ న్నారు.
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే వేముల వీరేశం
కేతేపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతాంగ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముం దుకు సాగుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అ న్నారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, కొండకిందిగూడెం, చెరుకుపల్లి, తుంగతుర్తి, కొ ప్పోలు, భీమారం, ఉప్పపహాడ్, చీకటిగూడెం, కా సనగోడు, బొప్పారం, గుడివాడ, ఇప్పలగూడెం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయ న శనివారం డీసీఎంఎస్ చైర్మన బోళ్ల వెంకటరె డ్డి, డీఎ్‌సవో వూర వెంకటేశ్వర్లు, శాసనమండలి మాజీచైర్మన నేతి విద్యాసాగర్‌లతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి న ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం వెనుకాడదన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం సై తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతు లు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎ్‌సవో వూర వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎన్.మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, పీఏసీఎస్ డైరెక్టర్లు గుత్తా మంజుల, చింతం వెంకటేశ్వర్లు, వి.ఇజాక్, కేశ య్య, మాజీ జడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాసయాదవ్, నాయకులు మాధవరెడ్డి, బొజ్జ సుం దర్, సీబీ.ప్రసాద్, బడుగుల నరేందర్, కె.మహేందర్‌రెడ్డి, కోట పుల్లయ్య, ప్రవీణ్, బి.రవీందర్, ముత్తమ్మ, మంగమ్మ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.