ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:20 AM
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

పెద్దఅడిశర్లపల్లి, మార్చి 5: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మం డలంలోని నంబాపురం, పెద్దగట్టు, నక్కలపెంటతండాలో సీసీరోడ్లకు మంగళవారం శంకుస్థాపన చేశారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్వేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారు. గ్రామాల్లో తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్ధులకు దుస్తులు ఉతకడానికి వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ఎస్‌వో సరళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆ పనులు ప్రారం భించాలని ఏఈని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు సమస్యలు సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోడియానాయక్, పల్లె సత్య నారాయణ, తేరా సత్యంరెడ్డి, ఎంపీడీవో చంద్రమౌళి, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంఈవో తరి రాములు, కస్తూర్బా పాఠశాల ఎస్‌వో సరళ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దు తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మండలం లోని మంత్రియతండా, చెన్నారం, గన్యనాయక్‌తండా, కేశ్యతండా, వర్ధమా నిగూడెం, చింతకుంట్ల, కొర్రతండా గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళ వారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్య క్షుడు ఉట్కూరి వేమన్‌రెడ్డి, ఎంపీపీ దూదిపాల రేఖరెడ్డి, జడ్పీటీసీ పస్నూరి సరస్వతమ్మ, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, ఎంఏ.సిరాజ్‌ఖాన్, కైసర్‌ఖాన్, ఎంపీడీవో రాంరెడ్డి, ఈవో వీరబాబు, గంధం సురేష్, ఎంపీటీసీ రాజురాణి, కోట్ల జగదీశ్, నీలం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
తిరుమలగిరి(సాగర్): ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రంగుండ్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీభగుడు శివాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న శివ, గణపతి, లక్ష్మీనర్సింహ్మస్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. లలిత దశ ఉపాసకుడు రాయప్రోలు శ్రీరాంశర్మ, ఇతర వేద పండితుల ఆధ్వర్యంలో గ్రామస్థులచే శాస్త్రోత్తంగా యజ్ఞాది క్రతువులను నిర్వహించారు. అనంతరం విగ్రాలను గ్రామంలో వేడుకగా ఊరేగించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్, మండల కాంగ్రేస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తలసాని చంద్రశేఖర్, ఆంగోతు బాలునాయక్, కోట్యానాయక్; బాబురావ్‌నాయక్, బాలునాయక్, శ్రీనునాయక్, సర్దార్‌నా యక్, కిషన్‌నాయక్, లచ్చునాయక్ తదితరులు పాల్గొన్నారు.