Share News

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ గురుకులాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:55 PM

కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠ శాలలు పని చేస్తున్నాయ ని జిల్లా కేంద్రంలోని ఎన్‌ టీఆర్‌ మహిళా డీగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్‌ విజ య్‌కుమార్‌ అన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ గురుకులాలు
జ్యోతి వెలిగించి వార్షికోత్సవాలను ప్రారంభిస్తున్న డిగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ల

- ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌

భూత్పూర్‌, ఫిబ్రవరి 17 : కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠ శాలలు పని చేస్తున్నాయ ని జిల్లా కేంద్రంలోని ఎన్‌ టీఆర్‌ మహిళా డీగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్‌ విజ య్‌కుమార్‌ అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్‌స్వగృహలో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో శనివారం ఏడవ వార్షికో త్సవం ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి పలు విషయాలను వివరించారు. గురుకులాల్లో చదువు కునే విద్యార్థులు ఎక్కువశాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే ఉంటారని, కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేటుకు దీటుగా అన్ని పోటీ పరీక్షల్లో సమానంగా ముందుకు పోతున్నాయంటే మీరు ఎంత గొప్ప వాళ్లో ఒక సారి ఆలోచించుకోవాలని అన్నారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థినులు చేసిన పలు నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్‌వో బస్వరాజు, ఉపాధ్యాయబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:55 PM