Share News

మెల్కొటే హ్యాట్రిక్‌

ABN , Publish Date - May 03 , 2024 | 04:57 AM

హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి ఇప్పుడు ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది! కానీ, తొలిసారి ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టింది అసలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదని తెలుసా!? ఔను.. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం

మెల్కొటే హ్యాట్రిక్‌

హైదరాబాద్‌లో గోపాలయ్య సుబ్బుకృష్ణ రికార్డు

హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి ఇప్పుడు ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది! కానీ, తొలిసారి ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టింది అసలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదని తెలుసా!? ఔను.. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గోపాలయ్య సుబ్బు కృష్ణ మెల్కొటే విజయం సాధించారు. ఆయన స్వస్థలం ఒడిసాలోని బరంపురం. తొలుత ఆయన 1952లో ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడే బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్‌లో హైదరాబాద్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1957 ఎన్నికల్లో మాత్రం రాయచూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు 1962 ఎన్నికల్లో మాత్రం హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సమయంలో కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. పార్టీలు వేరైనా తద్వారా ఆయన హ్యాట్రిక్‌ కొట్టారు.

Updated Date - May 03 , 2024 | 04:57 AM