Share News

మూల్యాంకన కేంద్రంలో వసతులు కల్పించాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:50 PM

చ్చే నెల మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఉన్నందున అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ నాయకులు కోరారు.

మూల్యాంకన కేంద్రంలో వసతులు కల్పించాలి
డీఈవో రవీందర్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 28 : వచ్చే నెల మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఉన్నందున అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ నాయకులు కోరారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ పీఆర్టీయూ వై.శ్యామ్‌బాబు, ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ తెలిపారు. గురువారం తెలంగాణ పీఆర్టీయూ నాయకులు డీఈవో రవీందర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు వివరించారు. వచ్చేనెల 3 నుంచి జరిగే మూల్యాంకనంలో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, గర్భిణులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అన్ని గదుల్లో ఏసీలు, ఫ్యాన్‌లు, లైట్స్‌, బిగించాలన్నారు. 58 ఏళ్ళు దాటిన ఎస్‌జీటీలకు మూల్యాంకనంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లపై డీఈవో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:50 PM