Share News

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌కు 15మంది కౌన్సిలర్లు గుడ్‌బై

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:28 AM

సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. జిల్లా కేంద్రం సూర్యాపేట మునిసిపాలిటీలో 15 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మునిసిపాలిటీలో

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌కు 15మంది కౌన్సిలర్లు గుడ్‌బై

సూర్యాపేట టౌన్‌, ఫిబ్రవరి 12: సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. జిల్లా కేంద్రం సూర్యాపేట మునిసిపాలిటీలో 15 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మునిసిపాలిటీలో అసమ్మతి తీర్మానానికి కారణమైన 31వ వార్డు కౌన్సిలర్‌ కొండపల్లి నిఖిలదిలీ్‌పరెడ్డిని ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో నిఖిలకు మద్దతుగా బీఆర్‌ఎ్‌సకు చెందిన 15 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ భవిష్యత్‌ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని సోమవారం విలేకరుల సమక్షంలో తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 03:28 AM