Share News

మహాలక్ష్మీ అలంకరణలో దుర్గాదేవి

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:09 AM

దేవి శరన్నవ రాత్రోత్స వాల్లో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శ్రీపార్వతవర్థిని అమ్మవారు మహాలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు.

మహాలక్ష్మీ అలంకరణలో దుర్గాదేవి
పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

భువనగిరి అర్బన్‌, అక్టోబరు 7: దేవి శరన్నవ రాత్రోత్స వాల్లో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శ్రీపార్వతవర్థిని అమ్మవారు మహాలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. కొండపైన శివాలయంలో వైభవంగా కొనసా గుతున్న ఉత్సవ వేడుకల్లో సోమవారం ఐదోరోజు అమ్మవారికి పూజారులు ప్రత్యేకంగా రూ.3,700 నగదు మాలతో (రూ.200, రూ.100 నోట్లు) అలంకరించారు. ఉదయం ప్రాతఃకాల పూజలు, అర్చనలు, పారాయణాలు, గాయత్రి జపాలు, లలిత సహస్రనా మార్చనలు మధాహ్నం పూజ నీరాజన మంత్ర పుష్పాలు అర్పించారు. సాయంత్రం నవావరణ పూజ, సహస్రనామార్చన నీరాజనం, మంత్ర పుష్పములు తీర్థ ప్రసాద వితరణ చేశారు.

హరిహరులకు పూజలు

స్వామివారి కొండపై సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, పార్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్పటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవార్లను మేల్కొలిపిన అర్చకులు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సంధ్య వేళ అలంకార వెండీ జోడు సేవలు, సహాస్రనామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొన సాగాయి. శివాలయంలోని ముఖమండపంలో స్పటిక మూర్తును అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సమూ ర్తులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయన ఖజానాకు రూ. 18,79,262ల ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌ రావు తెలిపారు.

Updated Date - Oct 08 , 2024 | 12:09 AM