Share News

వైభవంగా తిరుమలనాథుని కల్యాణం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:38 AM

వేలాది మంది భక్తులు తరలిరాగా పద్మావతి సమేత తిరుమలనాథుడి కల్యాణం శనివారం అంగ రంగ వైభవంగా జరిగింది.

వైభవంగా తిరుమలనాథుని కల్యాణం
తిరుమలగిరి సాగర్‌లో కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

తిరుమలగిరి(సాగర్‌), ఫిబ్రవరి 24: వేలాది మంది భక్తులు తరలిరాగా పద్మావతి సమేత తిరుమలనాథుడి కల్యాణం శనివారం అంగ రంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాగశుద్ధ పౌర్ణమినాడు కోనేటి పురం శివారులోగల తిరుమలయ్య గుట్టపై వెలసిన పద్మావతి సమేత తిరుమలనాథుని కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచే స్వామి, అమ్మవార్లకు గుట్టపై గల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉత్సవ విగ్రహా లను గుట్ట కింద గల కల్యాణమండపంలో ఆలయ ప్రధాన అర్చకులు రాయప్రోలు మురళీశర్మతోపాటు ఇతర వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కల్యాణతంతును నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. జాతర సందర్భంగా కొండపైకి వివిధ వాహనాల్లో భక్తులు వెళ్లి స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తు లకు కుంకుడుచెట్టుతండా గ్రామస్థుల సహకారంతో మహా అన్నదానం నిర్వహించారు. ఆలయంలో బుసిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి, వైస్‌ ఎంపీపీ యడవెల్లి దిలీప్‌రెడ్డి, ఆలయ ఛైర్మన్‌ బుర్రి రాం రెడ్డి, వెంపటి శ్రీనివాస్‌, ధర్మకర్త పేలపోలు శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం అనంతరం మహిళలచే కోలాటం నిర్వహించారు.

కనగల్‌: మండలంలోని పగిడిమర్రి గ్రామ శ్రీసీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సీతా రాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఒడిబియ్యం కట్న కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ సర్పంచులు గోలి నర్సిరెడ్డి దంపతులు, గోలి జగాల్‌రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు తలం బ్రాలను సమర్పించారు. ఎంపీటీసీ ఎర్రమాదయశోదమ్మ, మాజీఎంపీటీసీ సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గోత్ర నామార్చనలు, నీరాజన మంత్రపుష్ప పూజలను అర్చకస్వాములు నిర్వహిచారు. కాగా ఆదివారం శ్రీవీరబ్రహేంద్రస్వామివారి కల్యాణం, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

మర్రిగూడ: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని సరంపేటలో శ్రీ స్థంభగిరి లక్ష్మీనర్సింహ్మస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు వెంకటాచారి, నర్సింహ్మాచారి, శ్రీనివాసచారి, ఎంపీటీసీ రవీందర్‌రావు, మేతరి యాదయ్య, బేత వెంకటేష్‌యాదవ్‌, శ్రీనివాస్‌, వీరితో పాటు రేవంత్‌, బండి హనుమంత్‌, యాదయ్య, సరంపేట మాజీ సర్పంచ్‌ లక్ష్మమ్మవెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ కల్చరల్‌: పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు ఆనంద్‌ నగర్‌లో గల శ్రీభూనీలా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం శనివారం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలు మోగు తుండగా వేద పండితుల మంత్రోచ్సవాల మధ్య స్వామి వారు అమ్మవారి మెడలో మంగళ సూత్రధారణ తంతును సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామి అమ్మవారులను ఆశీనులను చేసి అర్చక స్వాములు రఘునందనా చార్యులు, లక్ష్మీనర్సింహ్మాచార్యులు, శ్రీనివాసశర్మ, లక్ష్మణాచార్యులు పూజలు నిర్వహించిన అనంతరం పుణ్యవాచనం, కంకణదారణ, జిలకర్రబెల్లం, తలంబ్రాలు తంతును జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మారం గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాద వాసుదేవ్‌, సభ్యులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, పిచ్చయ్య, నారాయణ పాల్గొన్నారు. పట్టణంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లోని అభయాంజనేయస్వామి దేవాయలయంలో సామూ హిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వంద మంది దంపతులు సామూహికంగా వ్రతాలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వెంకటేశ్వరశర్మ, ఆలయ అధ్యక్షుడు బైరగోని రాజయ్య, సభ్యులు ఉట్కురి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:38 AM