Share News

రైతు బంధు నిధులను త్వరగా ఇవ్వండి

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:06 AM

రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు నిధులను త్వరితగతిన అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

రైతు బంధు నిధులను త్వరగా ఇవ్వండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు నిధులను త్వరితగతిన అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుబంధు నిధులపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శులతో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌ కోసం వరి, ఇతర పంటల సాగు ముమ్మరంగా మొదలైందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు సొమ్ము ను అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని, అధిక సంఖ్యలో రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 04:06 AM