Share News

పిస్తా హౌస్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:41 AM

ఉప్పల్‌లోని పిస్తా హౌస్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. అక్కడ తాను

పిస్తా హౌస్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు

కేకులో ఫంగస్‌ ఉందన్న ఫిర్యాదుపై స్పందన

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లోని పిస్తా హౌస్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. అక్కడ తాను కొన్న బనాన కేకులో ఫంగస్‌ (బూజు) ఉందని ఓ నెటిజన్‌ ఫిర్యాదు చేశారు. స్పందించిన ఫుడ్‌సేఫ్టీ, ఇతర అధికారులు ఆదివారం ఉప్పల్‌ జాహిద్‌నగర్‌లోని పిస్తాహౌ్‌సకు వెళ్లి పరిశీలించారు. నిర్వహణా లోపాలున్నట్టు గుర్తించారు. ప్లమ్‌, స్పాంజ్‌ కేక్‌, మిల్క్‌ బ్రెడ్‌ల నుంచి నమూనాలు సేకరించారు. వీటితోపాటు ఫంగస్‌ ఉన్న బనాన కేకును రాష్ట్ర ఫుడ్‌ లేబరేటరికి పంపారు. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 03:41 AM