Share News

రూ.8.74లక్షల విలువైన జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టివేత

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:44 PM

షాద్‌నగర్‌ శివారులోని ఓ వెంచర్‌లో రూ.8.74లక్షలకుపైగా విలువైన ప్రమాదకర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి తెలిపారు. షాద్‌నగర్‌ పోలీ్‌స స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

రూ.8.74లక్షల విలువైన జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టివేత
స్వాధీనం చేసుకున్న జిలెటిన్‌ స్టిక్స్‌

నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పరారీలో ప్రధాన నిందితుడు

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 1: షాద్‌నగర్‌ శివారులోని ఓ వెంచర్‌లో రూ.8.74లక్షలకుపైగా విలువైన ప్రమాదకర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి తెలిపారు. షాద్‌నగర్‌ పోలీ్‌స స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. షాద్‌నగర్‌ పరిధి కమ్మదనం శివారులో ఉన్న బృందావనం కాలనీ రియల్‌ వెంచర్‌లో పేలుడు పదార్థాలున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు శంషాబాద్‌ ఎస్‌ఓటీ, షాద్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారన్నారు. ‘బిల్డింగ్‌ బ్లాగ్‌’ రియల్‌ ఎస్టేట్స్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి అక్రమంగా పేలుడు పదార్థాలు వాడేందుకు పేలుడు పదార్థాలను తెప్పించినట్టు చెప్పారు. వాటిని నల్లగొండ జిల్లాకు చెందిన సతీష్‌ దిగుమతి చేసేవాడని అన్నారు. వారి నుంచి 490జిలెటిన్‌ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాటిని కలిగి ఉన్న నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కమ్మదనం శివారులో ఉన్న ‘బిల్డింగ్‌ బ్లాగ్‌’లోని రాళ్లను పగులగొట్టేందుకు ఈ జిలెటిన్‌ స్టిక్స్‌ను నిల్వ చేశారన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనంకు చెందిన ఉరుసు నర్సింలు (60), అలాగే పట్టణంలోని మాంటీస్సోరి పాఠశాల సమీపంలో నివసించే ఈశ్వర్‌(45), ఉరుసు రాజు, రమే్‌షలను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కాగా వెంచర్‌ యజమాని మధుసూదన్‌రెడ్డి, సతీష్‌, ఐడియల్‌ ఇండస్ర్టియల్‌ ఎక్స్‌ప్లోర్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. జిలెటిన్‌ స్టిక్స్‌తో పాటు కంప్రెషర్‌ ట్రాక్టర్‌, నాలుగు ఫోన్లు, ఒక ఫైర్‌ కట్టర్‌, ఎలక్ర్టిక్‌ టెస్టర్‌, ఇతర సాంకేతిక సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బి ల్డింగ్‌ బ్లాగ్‌కు చెందిన యజమాని మధుసూదన్‌రెడ్డి అనుమతులు లేకుం డా పేలుడు పదార్థాలను తెప్పించి వాడుతున్నట్టు గుర్తించామన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన ఐడియల్‌ ఇండస్ర్టియల్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి వీటి సరఫరాకు బాధ్యుడన్నారు. క్రైమ్‌ నంబర్‌ 421-2024 ప్రకారం 4 అండ్‌ 5 ఆఫ్‌ ఎక్స్‌ ప్లోజివ్‌ యాక్ట్‌ 1908 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పలింగం, ఎస్‌ఓటీ సీఐ సంజయ్‌కుమార్‌, ఎస్సై శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2024 | 11:44 PM