Share News

గౌతముడు సామాజిక విప్లవకారుడు

ABN , Publish Date - May 23 , 2024 | 11:08 PM

గౌతమ బుద్ధుడు సామాజిక విప్లవకారుడని మహా మాయ గౌతమ బుద్ధ విహార్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆది లక్ష్మయ్య, కార్యదర్శి వడ్డెమాన్‌ బాలపీరు అన్నారు.

గౌతముడు సామాజిక విప్లవకారుడు
బుద్ధుడి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సభ్యులు

- మహామాయ గౌతమ బుద్ధ విహార్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆది లక్ష్మయ్య

పాలమూరు, మే 23 : గౌతమ బుద్ధుడు సామాజిక విప్లవకారుడని మహా మాయ గౌతమ బుద్ధ విహార్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆది లక్ష్మయ్య, కార్యదర్శి వడ్డెమాన్‌ బాలపీరు అన్నారు. గురువారం క్రిస్టియన్‌పల్లి దగ్గర మహామాయ గౌతమ బుద్ధ విహార్‌ దగ్గర జయంతి, బుద్ధపూర్ణిమను నిర్వహించారు. కార్యక్ర మంలో వారు మాట్లాడుతూ బౌద్ధం ఒక మతం కాదు జీవన విధానమని, తర్కం కాదు, జ్ఞానం అని అది ఎప్పుడో సిద్ధమై ఉన్నదన్నారు. జ్ఞానం వెలుగు బాట చూపుతుందని, ఒక నాగరికత సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించిందని చారిత్రక కర్తవ్యాన్ని బౌద్ధం స్వీకరించిందన్నారు. అందువల్ల బౌద్ధాన్ని ప్రపంచా నికి అందించిన గౌతముడు ఒక సామాజిక విప్లవకారుడన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ అధ్యక్షుడు డాక్టర్‌ నాగయ్య, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి పరమేశ్వర్‌, రమేష్‌, మంగనూర్‌ వెంకటేష్‌, ఆది రూతమ్మ, గంధం శ్రీదేవి, రాజవ ్ము, లావణ్య, ఎం.సోలేమాన్‌, ఎం.మాణిక్యంరాజు, అక్షరకిరణం వెంకటస్వామి, రాములు, విజయకుమార్‌, రామస్వామి, ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

ఘనంగా గౌతమ బుద్ధుడి జయంతి

ప్రకృతి ధర్మం, శాస్త్రీయ దృక్ఫథంతో సమాంతరంగా ప్రయాణిస్తూ భారతదేశంలో కొన్ని వేల ఏళ్లుగా బౌద్ధం కొనసాగుతోందని బుద్ధిస్ట్‌ సొసైటీ ఆప్‌ ఇండియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉం.ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ నాగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో గౌతమ బుద్ధుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. యుద్ధకాంక్షతో రగులుతూ, కులమతాల వైశమ్యాలతో కొట్టుమి ట్టాడుతున్న సమాజంలో ఐక్యత నెలకొల్పి శాంతి, సమానత్వం సమసమాజ వనసమాజ నిర్మాణం నెలకొల్పడానికి బౌద్ధమే శరణ్యమన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు గడ్డమీది గోపాలకృష్ణ, వెంకట్రాములు, గురువరాజు, ఆది లక్ష్మయ్య, వడ్డెమాన్‌ బాలపీరు, మెతుశల, బుర్ర సురేష్‌, దినేష్‌, పశువుల రాజు, కామారం వెంకటేష్‌, కాంకి రమేష్‌, శ్రీకాంత్‌, వడ్డ రాఘు, బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:08 PM