Share News

ఏసీబీకి చిక్కిన గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:31 AM

గిఫ్ట్‌ డీడ్‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన కరీంనగర్‌ జిల్లా గంగాధర ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురే్‌షబాబును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెడ్‌

ఏసీబీకి చిక్కిన గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌

గిఫ్ట్‌ డీడ్‌ చేసేందుకు రూ.10 వేల డిమాండ్‌

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి తీసుకుంటుండగా అరెస్టు

గంగాధర, ఏప్రిల్‌ 27: గిఫ్ట్‌ డీడ్‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన కరీంనగర్‌ జిల్లా గంగాధర ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురే్‌షబాబును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్లకు చెందిన కొప్పుల రాజేశంకు కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సర్వే నంబరు 131లో 1304.66 చదరపు గజాల స్థలం ఉంది. అందులో నుంచి 484 చదరపు గజాలను తన కుమారుడు అజయ్‌కి గిఫ్ట్‌ డీడ్‌ చేయడానికి రాజేశం తన స్నేహితుడు ఆకుల అంజయ్య ద్వారా గంగాధరకు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురే్‌షబాబును సంప్రదించాడు. ఇందుకోసం సురే్‌షబాబు రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డాక్యుమెంటు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం ఇవ్వడం ఇష్టంలేని అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహాతో సురే్‌షబాబు సూచన మేరకు రాజేశం రూ.10 వేలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్‌కు ఇస్తుండగా... ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బుతోపాటు వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 10:10 AM