భక్తి శ్రద్ధలతో గంధోత్సవం
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:10 PM
జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులో గల హజ్రత్ సయ్యద్ అబ్దుల్‌ఖాదర్‌షా సహెబ్ రహమాతుల్లా అలై దర్గా 86వ ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

- కొనసాగుతున్న అబ్దుల్‌ఖాదర్ దర్గా ఉత్సవాలు
- భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులో గల హజ్రత్ సయ్యద్ అబ్దుల్‌ఖాదర్‌షా సహెబ్ రహమాతుల్లా అలై దర్గా 86వ ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవ వేడుకలు ముతవల్లీ మహ్మద్ అబ్దుల్ జమీర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, గంధోత్సవం షేక్‌బడేసాబ్ ఇంటి నుంచి ఒంటెపై ఊరేగింపుగా అశోక్‌టాకీస్ చౌరస్తా, ఎస్‌బీహెచ్ రోడ్డు, తూర్పు కమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్‌టౌన్ గుండా దర్గా వద్దకు చేరుకుంది. మగ్రిబ్ నమాజ్ అనంతరం దర్గాలో చాదర్ సమర్పించి ఫాతేహాలు అందజేశారు.