Share News

manchiryala- ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:12 PM

మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అథితిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి బోనమెత్తుకుని ఆలయానికి వచ్చి మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ జడ్పీ చైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి బోనాలు సమర్పించారు.

manchiryala- ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర
బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్తున్న ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

మందమర్రిరూరల్‌, జూలై 28: మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అథితిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి బోనమెత్తుకుని ఆలయానికి వచ్చి మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ జడ్పీ చైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి బోనాలు సమర్పించారు. వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని మైసమ్మ తల్లిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకం వంటి హామలు అమలు చేశామని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇటీవల మేడిగడ్డ కాళేశ్వరం పర్యటనకు వచ్చిన కేటీఆర్‌ చేసిందేమి లేదని , కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచుతానని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముంచుతానన్నారు. బొక్కలగుట్టలోని గాంధారి వనాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌రావు, ఏసీపీ రవికుమార్‌, సీఐ శశిధర్‌రెడ్డి, మందమర్రి, రామకృష్ణపూర్‌ ఎస్‌ఐలు రాజశేఖర్‌, రాజశేఖర్‌ , మందమర్రి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు, ఆలయ పూజారీ రమణచారి, కాంగ్రెస్‌ నాయకులు సొత్కు సుదర్శన్‌, బండి సదానందం యాదవ్‌, మండ భాస్కర్‌ , నీలయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కళావతి, పార్వతి విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:12 PM