Share News

తాటికోలులో జూదరుల అరెస్ట్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:19 AM

దేవరకొండ మండలం తాటికోలు గ్రా మశివారులోని తోటలో పేకాట ఆడుతున్న ఐదుగురుని అదుపులోకి తీ సుకున్నట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు.

 తాటికోలులో జూదరుల అరెస్ట్‌

తాటికోలులో జూదరుల అరెస్ట్‌

దేవరకొండ, ఫిబ్రవరి 16: దేవరకొండ మండలం తాటికోలు గ్రా మశివారులోని తోటలో పేకాట ఆడుతున్న ఐదుగురుని అదుపులోకి తీ సుకున్నట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. శుక్రవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. తాటికోలు గ్రామశివారులోని తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి న ట్లు తెలిపారు. దీంతో పేకాట ఆడుతున్న నాంపల్లి మండలం మేళ్లవాయికి చెందిన గిరి, దుగ్యాలకు చెందిన వెంకటేష్‌, వాసు, వెంకటయ్య, వెంకటే్‌షలను అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, రూ.64,640 నగదును, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు సీఐ నర్సింహులు వివరించారు.

Updated Date - Feb 17 , 2024 | 12:19 AM