Share News

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకం

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:21 AM

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకమేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ అని తెలిపారు. రాష్ట్రంలో 13-14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ధీమా

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతోనే పోటీ

రాష్ట్రంలో కాంగ్రె్‌సకు 13-14 సీట్లు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సూర్యాపేట టౌన్‌, మార్చి 29: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకమేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ అని తెలిపారు. రాష్ట్రంలో 13-14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సూర్యాపేటలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ్యత్వాల్లో కాంగ్రెస్‌ పార్టీ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ స్థానాన్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే సమయం వృథా అని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బీజేపీతోనే పోటీ అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన వాగ్ధానాలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడే ప్రధాని మోదీ, ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల ద్వారా రుణాలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. శనివారం నుంచి నల్లగొండ జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారరు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 05:21 AM