Share News

మెట్రో రెండో దశ ఏర్పాటుకు నిధులివ్వండి

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:53 AM

హైదరాబాద్‌లోని మెట్రో రైల్‌ రెండో దశ ప్రాజెక్టుకు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థల ఏర్పాటుకు సహకరించాలని న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాండియన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. గురువారం సచివాలయంలో సీఎంతో పాండియన్‌ సమావేశమయ్యారు.

మెట్రో రెండో దశ ఏర్పాటుకు నిధులివ్వండి

న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ డీజీ పాండియన్‌ ను కోరిన రేవంత్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మెట్రో రైల్‌ రెండో దశ ప్రాజెక్టుకు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థల ఏర్పాటుకు సహకరించాలని న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాండియన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. గురువారం సచివాలయంలో సీఎంతో పాండియన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల నిర్మాణానికి, విద్యాసంస్థల వసతి గృహాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణాలు, వేస్టేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. అనంతరం పాండియన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

10 వేల మంది విద్యార్థులకు శిక్షణ

ఉపాధి కల్పనలో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకమని రేవంత్‌ రెడ్డి అన్నారు. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌(బీఎ్‌ఫఎ్‌సఐ) కన్సార్షియం ప్రతినిధులు గురువారం సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ వారితో మాట్లాడారు. ఇంజినీరింగ్‌, బిజినెస్‌ రంగాల్లో సాంకేతిక నిపుణుల తయారీకి బీఎ్‌ఫఎ్‌సఐ కీలక పాత్ర పోషించాలని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5 వేల మంది ఇంజినీరింగ్‌, 5 వేల మంది బిజినెస్‌ గ్రాడ్యుయేట్లకు తగిన సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు బీఎ్‌ఫఎ్‌సఐ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Updated Date - Feb 02 , 2024 | 07:30 AM