Kumaram Bheem Asifabad- క్రీడలతో స్నేహభావం
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:36 PM
క్రీడలతో యువతకు ఇతర ప్రాంతాల వ్యక్తులతో స్నేహభావం పెరుగుతుందని ఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఫైనల్ నిర్వహించారు.
ఆసిఫాబాద్, మార్చి 3: క్రీడలతో యువతకు ఇతర ప్రాంతాల వ్యక్తులతో స్నేహభావం పెరుగుతుందని ఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఫైనల్ నిర్వహించారు. మ్యాచ్‌లో ఆర్డ్మ్ పోలీస్ టీంపై స్పెషల్ పార్టీ పోలీసు టీం 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్డ్మ్ పోలీస్ టీంపై స్పెషల్ పార్టీ పోలీసు టీం మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్పెషల్ పార్టీ పోలీసు టీం నిర్ణీత 15 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. చుంచు మహేష్ 71 పరుగులు, నాగేంద్రబాబు 46 పరుగులతో రాణించారు. 62 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగన ఆర్డ్మ్ పోలీసు టీం 15 ఓవర్లలో 116 పరుగులు చేసింది. విజేత జట్టును ఎస్పీ అభినందించారు.