Share News

ఇంజనీరింగ్‌ సీటు ఇప్పిస్తామని మోసం

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:31 PM

ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు ఇప్పిస్తానని డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంజనీరింగ్‌ సీటు ఇప్పిస్తామని మోసం

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 24: ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు ఇప్పిస్తానని డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌కు చెందిన జక్కుల కృష్ణవేణి తన కుమారుడు అభినవ్‌ ఘట్‌కేసర్‌ మండలం, అవుశాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు ఇప్పిస్తానని లాలాపేట్‌కుచెందిన జలేందర్‌చారి, సికింద్రాబాద్‌ కార్ఖానాకు చెందిన లెనిన్‌గౌడ్‌లు చెప్పారు. ఇందుకు గానూ రూ.3,30,000లు అవుతాయని చెప్పడంతో అభినవ్‌ తల్లి ఈనెల 10న జలేందర్‌చారి, లెనిన్‌గౌడ్‌లకు ఆ మొత్తాన్ని ఇచ్చింది. రెండువారాలు గడుస్తున్న కళాశాల సీటు ఇప్పించలేదు. దీంతో అభినవ్‌ అతడి తల్లి పలుమార్లు సీటు గురించి ఫోన్‌చేసినా స్పందించలేదు. దీంతో బాధితులు శనివారం ఘట్‌కేసర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 11:31 PM