Share News

మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:47 PM

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులకు శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు.

మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

-30ఎకరాల్లో రూ.235 కోట్ల నిధులతో నిర్మాణం

-హాజరైన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, ఆగస్టు21: వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులకు శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌ పట్టణంలోని మేకల గండి సమీపంలో కళాశాల నిర్మాణానికి 30 ఎకరాల స్థలంలో రూ.235 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టనున్నారు. మంజూరైన నిధులతో ప్రిన్సిపల్‌, ఆర్‌ఎంవో సూపరింటెండెంట్‌ క్వార్టర్లతో పాటు వసతి గృహాలను నిర్మించనున్నారు. అంతకుముందు శాసన సభాపతికి కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకగా, వేత మంత్రోశ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేశ్‌, వైస్‌ చైర్మన్‌ శంషాద్‌ బేగం, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుధాకర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత నాయక్‌, ఈఈ శ్రీధర్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ పద్మ, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, నాయకులు విశ్వనాథం సత్యనారాయణ, కిషన్‌ నాయక్‌, రాంచందర్‌ రెడ్డి, జాఫర్‌, మహిపాల్‌ రెడ్డి, నరోత్తంరెడ్డి, ఆసిఫ్‌, వెంకట్‌ రెడ్డి, మురళి తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:47 PM